చితికిపోయే 'నిరపకాయకర'మైన ద్రవ్యోల్బణం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ద్రవ్యోల్బణం అదుపు చేయడం కేవలం చట్ట సంబంధ వ్యవహారం కాదు. అది అభివృద్ధి లక్ష్యాలకు కూడా సంబంధించింది. ద్రవ్యోల్బణం ప్రస్తావన లేకుండా జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 2019 ఎన్నికలే కావచ్చు. గత అయిదేళ్ల కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం పతాక శీర్షికలకు ఎక్కకుండా కళ్లెం వేశారు. 2014 నుంచి 2018 ఏప్రిల్ వరకు వినియోగదార్ల ధరల సూచీతో పోలిస్తే ఏ యేటికి ఆయేడు 6.65 శాతం నుంచి 2.42 శాతానికి తగ్గుతూ వచ్చింది. ఈ అంచనాలకు రావడానికి అసలు కారణం 2 శాతం నుంచి 6 శాతం దాకా ఉండవచ్చు అన్న వాదనవల్ల ద్రవ్యోల్బణం తగ్గినట్టు కనిపించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వూ బ్యాంకు ఈ విధానాన్ని అనుసరించింది.
స్థూల ఆర్థిక విధానం ప్రకారం ద్రవ్యోల్బణానికి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ద్రవ్యోల్బణం ఒక మేరకు అధిక స్థాయిలో ఉండవచ్చునంటారు. అయితే ఒక స్థాయి దాటి ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్థికాభివృద్ధికి విఘాతం కలుగుతుందనే వాదనా ఉంది. ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటే అభివృద్ధి సాధ్యం అన్నది అనుభవం అయినప్పటికీ ఇది కొన్ని సార్లు సానుకూలంగా ఉన్నా మరి కొన్ని సార్లు అంతగా ప్రభావం చూపలేదు. ఆర్.బి.ఐ. అనుమతించే ద్రవ్యోల్బణం ప్రకారం వినియోగదార్ల ధరల సూచీ ప్రకారం 2019లో అయిదు నెలల అత్యధిక ద్రవ్యోల్బణం 2.92 శాతం ఆర్.బి.ఐ. ప్రకారం నిరపాయకరమైందే. మూడు నెలల కాలంలో ఆర్.బి.ఐ. తన విధాన రేటును 5.75 శాతం నుంచి 6 శాతానికి కట్టడి చేసింది. ప్రస్తుతం స్థూల జాతీయోత్పత్తి 5/8 శాతం ఉంది. దీన్ని 2019-20లో లక్ష్యంగా నిర్దేశించుకున్న 7 శాతానికి పరిమితం చేయడానికి, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి, వినియోగ వ్యయం పెంచడానికి ఆర్.బి.ఐ. ఈ పని చేసింది. అయితే దీని పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆత్మ పరిశీలన చేసుకోలేదు. విస్తృతమైన సామాజిక-ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉంటాయో ఆలోచించలేదు.
దాదాపు అయిదు దశాబ్దాలుగా ఆర్థిక వ్యవహారాల మీద వచ్చిన సాహిత్యం ఆర్థిక విజయాలకు స్థూల జాతీయోత్పత్తికి లంకె ఉంటుందంటారు. ద్రవ్యోల్బణాన్ని ఇది అదుపు చేయలేదు. స్థూల జాతీయోత్పత్తిని పెంచడాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండవచ్చు. ఉదాహరణకు ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. మధ్య తరగతి జీవులు బీజేపీని సమర్థించారు. వినియోగదారుల్లో ఎక్కువ మంది ఈ మధ్య తరగతి వాళ్లే. అందువల్లే బీజేపీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో వినియోగదార్ల ధరల సూచీ పెరగకుండా చూసింది. అదే సమయంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే వారికి తక్కువ ధర అందినా ఖాతరు చేయలేదు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం ఆవరించింది. మరో వేపున మధ్యతరగతి ప్రజలు ఎన్నడూ వ్యవసాయ సంక్షోభాన్ని ప్రస్తావించి రైతుల పట్ల, వారి దుర్భర జీవన స్థితిపట్ల సానుభూతి ప్రదర్శించ లేదు.
ఇలాంటి పరిస్థితిలో నిరపాయకరమైన ద్రవ్యోల్బణం నిజానికి రెచ్చగొడ్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణ ప్రభావం వినియోగదార్ల ధరల సూచీ మీద, టోకు ధరల సూచీ మీద, స్థూల జాతీయోత్పత్తి మీద కూడా ప్రభావం చూపుతుంది. వివిధ వస్తువుల ధరలు ఆర్థిక వ్యవస్థలో భాగమైన వారందరిపై భిన్న రీతిలో ప్రభావం చూపుతుంది. ఆ రకంగా చట్టం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం జనాన్ని విడదీయడానికి, పరాయివాళ్లుగా చూడడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయాన్ని మలిచేవారు ఇది ప్రయోజనకరం అని ప్రచారం కూడా చేస్తారు. వినియోగదార్ల ధరల సూచీ టోకు ధరల సూచీకన్నా ఆర్థిక విధానాలను నిర్దేశించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది చిల్లర వస్తువుల ధరలలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు. అయితే సాంకేతికంగా చూస్తే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్.బి.ఐ. అనుసరించిన విధానం వినియోగదార్ల ధరల సూచీపై అంతగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే పానీయాలు, ఆహార పదార్థాల ధరలే వినియోగదార్ల ధరల సూచీలో 46 శాతం ప్రభావం చూపించాయి. మన దేశంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం వాటి సరఫరా మీద ఆధారపడి ఉంటుంది. అంటే ముడి చమురు ధరల్లో ఎగుడు దిగుళ్లు, దేశంలో పంటల తీరు మొదలైనవాటి మీద ఆర్.బి.ఐ.కి ఎలాంటి నియంత్రణా లేదు. ఈ ఆర్థిక అంశాల ఆధారంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజకీయ చర్యలు తీసుకుని ఎగుమతులు, సరుకు నిలవ చేయడం మీద ఆంక్షలు విధించి ఆహార పదార్థాల సరఫరాను నియంతించింది. సుంకం లేకుండా దిగుమతులను అనుమతించింది. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) విధింపువంటి చర్యలు తీసుకుంది. సేవా పన్ను విధించింది. దీనివల్ల మార్కెట్లో నగదుకు కొరత ఏర్పడింది. కొనే వారికి విశ్వాసం తగ్గింది.
వినియోగ వస్తువుల ధరలు నిరపాయకరంగా ఉండడం యాదృచ్ఛికం మాత్రమే. ఇది వినియోగదార్ల దృష్టిలో కనిపించేటంతటి నిరుపద్రవమైంది కాకపోవచ్చు. ఎందుకంటే ఇద్ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మీద ఆధారపడింది. దీన్ని టోకు ధరల సూచీతో కొలుస్తారు. ఇది 33 నెలల కాలంలో అత్యధికంగా 7.4 శాతానికి పెరిగింది. ఏ యేటికాయేడు లెక్కన చూస్తే పప్పు ధాన్యాల ధరల ద్రవ్యోల్బణం దాదాపు 14 శాతం ఉంది. తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉంది. వాతావరణ శాఖ రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటుందని సూచించడం లేదు. అంటే వ్యవసాయోత్పత్తులు తగ్గొచ్చు. ధరలు మరింత పెరగవచ్చు. భౌగోళిక రాజకీయ కారణాలవల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రస్తుతం పీపాకు 60 డాలర్లు ఉన్న ధర పెరగవచ్చు. దీనివల్లా ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చు.
ప్రభుత్వం ఆహార పదార్థాల ఆర్థిక అంశాలను ఎలా నిర్వహించగలుగుతుందనే దాన్నిబట్టే రైతులకు ఏ మేరకు ప్రయోజనం ఉంటుంద్ప తేలుతుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ మునుపటి లాగా అందరికీ అభివృద్ధి అన్న అతిశయోక్తితో కూడిన వాగ్దానాలు చేయకుండా ఉంటుందా? లేదా సమగ్రమైన అభివృద్ధి పంథా అనుసరిస్తుందా? లేదా గతంలో లాగా స్థూల జారీయోత్పత్తి ఎండమావులను వేటాడడానికే పరిమితం అవుతుందా?