ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అలింగులకూ సమాన హక్కులు అవసరం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

లింగ మార్పిడి చేసుకున్నవారు, జన్యుపరంగానే నికరమైన లింగానికి వార్తించని వారు అంటే అలింగులు (ట్రాన్స్ జెండర్లు) 92 శాతం ఆర్థిక వ్యవస్థలో భాగం కావడం లేదని ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో తేలింది. ఈ పరిస్థితిలో మనల్ని మనం "ఆధునికులం" అనుకోవడం అర్థరహితం. గణనీయమైన సంఖ్యలో ఉన్న వారికి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి భాగస్వామ్యం లేదు అంటే వారికి ప్రాథమిక హక్కులు నిరాకరిస్తున్నట్టే. ఇలాంటి వారు బలవంతాన బిచ్చమెత్తుకోక తప్పడం లేదు. లేదా సమాజం వారిని అంగీకరించదు కనక పడుపు వృత్తి అయినా చేపట్టాలి. వారికి ఉద్యోగాలు దొరకవు. లింగ మార్పిడి చేసుకున్న వారి ప్రధానమైన సమస్య వారికి లైంగికంగా ఏ పౌరసత్వమూ లేకపోవడమే. మన దేశంలోని ఇలాంటి 99 శాతం మందిని సమాజం అంగీకరించడానికి తిరస్కరిస్తోందని మానవ హక్కుల కమిషన్ సర్వేలో తేలింది. ఈ వర్గంలోని వారు జనం అందరూ ఉండే చోటో, స్త్రీ, పురుషులిద్దరితో లైంగిక సంపర్కం పెట్టుకునే వారితో కలిసి జీవించడానికి అవకాశం ఉండడం లేదు. వారికి గౌరవమూ ఉండదు. ఎందుకంటే వారి శరీరాలే మచ్చపడి ఉంటాయి. అందుకే వారికి ఎలాంటి అవకాశాలు ఉండనందువల్ల వారు సమాజం నుంచి వెలివేసిన నిర్భాగ్యుల్లాగే బతకాలి. వారి మీద లైంగిక వేధింపులు, వైద్యపరంగా నిర్లక్ష్యం సర్వ సాధారణం. వారు తమ కుటుంబ సభ్యులతోనూ ఉండడానికి వీలు ఉండడం లేదు. అందుకే సామాజికంగా వారికి ఏ స్థాయీ ఉండదు. లింగ మార్పిడి చేసుకున్న వారో, లేదా జన్యులోపాలు ఉన్న వారిలో కుటుంబంతో జీవిస్తున్నది కేవలం రెండు శాతమేనని ఈ సర్వేలో తేలింది.

ఈ లోపాన్ని సవరించడమే 2014 నాటి అలింగుల (హక్కుల రక్షణ) బిల్లు  ఉద్దేశం. వారికి అవకాశాలు కల్పించడం కూడా ఈ బిల్లులో భాగం. ఆగస్టులో పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అనేక మార్పులు, సవరణలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ బిల్లు ఉన్న దశలో ఈ అంశంపై 2017లో పార్లమెంటు స్థాయీ సంఘం చేసిన రెండు ముఖ్యమైన సిఫార్సులను చేర్చనే లేదు. అలింగులకు ఉద్యోగాల్లోరిజర్వేషన్లు కల్పించాలన్నది స్థాయీ సంఘం సిఫార్సుల్లో ప్రధానమైంది. దీనివల్ల అలింగులకు ఆర్థిక వ్యవస్థ నుంచి మినహాయింపు సమస్యను అధిగమించవచ్చు.

అలింగులకు పెళ్లి చేసుకునే హక్కు, జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉండాలన్నది రెండవ ప్రధానమైన సిఫార్సు. కేవలంస్త్రీలు, పురుషులు అన్న వారినే గుర్తించే సమాజంలో ఈ హక్కు కొంత క్లిష్టమైందే. లింగ పరంగా భారత సమాజం ఈ రెండు లింగాలవారినే గుర్తింస్తుది. లింగానికి సంబంధించిన ఈ యుగ్మం కారణంగానే వారిని సమాజం అంగీకరించడం లేదు. హక్కులు లేకుండా చేస్తోంది. ఈ బిల్లు మొదటి ముసాయిదాలో అలింగులు అన్న మాటకు చెప్పిన నిర్వచనం వారికి ఇబ్బందికరంగా ఉండేది. అంటే వారిని స్త్రీలుగానో, పురుషులుగానో గుర్తించకపోవడం మొదటి ముసాయిదా వల్ల వచ్చిన ఇబ్బంది. ఇలాంటి నిర్వచనం అలింగులకు అవమానకరమైంది. పైగా ఇది లింగపరంగా యుగ్మానికి ఆవల ఆలోచించడానికి ఉపకరించదు. అలింగులు అంటే ప్రతికూల అభిప్రాయమే వ్యక్తం చేస్తుంది. కాని ఆ తర్వాత ముసాయిదాలో ఈ నిర్వచన లోపాన్ని సరిదిద్దారు. తాజా ముసాయిదాలో అలింగులను "ఒక వ్యక్త జన్మ రీత్యా నిర్దిష్టమైన లింగం నిర్వచనంలోకి రాని వారు" అని నిర్వచించారు.

అలింగులను వేధించడానికి బోలెడు చట్టాలు ఉపయోగపడ్తున్నాయి. ఈ చట్టాలను ఏకపక్షంగా వినియోగిస్తున్నారు. భిక్షాటన నిషేధ చట్టం ఇందులో ప్రధానమైంది. అలింగులకు రిజర్వేషన్లు కల్పించడంవల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. అలింగుల మీద చర్య తీసుకోవడానికి భారత శిక్షా స్మృతిలోని 377వ సెక్షన్ ను తరచుగా వినియోగిస్తుంటారు. ఈ సెక్షన్ "అసహజమైన లైంగిక సంబంధాలను" నేరంగా పరిగణించేది. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఇక ఆ సమస్య ఉండదు. లింగంతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు పెళ్లిళ్లు చేసుకోవచ్చునని, సహజీవనం చేయవచ్చునని ఈ తీర్పులో పేర్కొన్నారు. అలింగుల లైంగిక సంబంధాలను అసహజమైనవిగా భావించి అరెస్టు చేసే వారు. అయితే వీరికి వారి లైంగిక హక్కులను పరిరక్షించడానికి ప్రత్యేక న్యాయ సంబంధ ఏర్పాట్లు ఉండాలి. ఈ బిల్లులో అలింగుల పట్ల వివక్ష చూపడం అంటే ఏమిటో కూడా నికరంగా లేకపోవడం మరో లోపం. సుప్రీం తీర్పువల్ల చాలా న్యాయం జరిగే మాట వాస్తవమే అయినా అలింగులకు లైంగిక పౌరసత్వం అవసరం.

అలింగులకు సంబంధించి కేంద్రం ఏ చట్టం చేసినా అది తమిళనాడు ఉదంతానికి అనుగుణంగా ఉండాలి. 2014లో తమిళనాడు ప్రభుత్వం అలింగులకోసం ఓ ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. వారికి రాయితీకి గృహ వసతి కల్పించడం, ఏదో ఓ వృత్తి చేపట్టడానికి శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రులలో లింగ మార్పిడి చేయడానికి అవకాశం కల్పించడం వంటి అంశాలకు తమిళనాడు అవకాశం కల్పించింది. నిర్దిష్టమైన ప్రభుత్వాలలో ఈ రకమైన శస్త్ర చికిత్సలకు వీలు కల్పించారు. 2018లో కేరళ కూడా రెండు లక్షల మంది అలింగులకు ఇలాంటి శస్త్ర చికిత్సలకు వీలు కల్పించి ఈ వర్గం వారి సమస్య పరిష్కరించడానికి దోహదం చేసింది. ప్రభుత్వం నుంచి వారికి కావలసిన మద్దతు ఇదే. అప్పుడే వారికి ఆరోగ్య పరిరక్షణ, కుహనా వైద్యుల చేతిలో మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.

అలింగులు నిత్యజీవితంలో అందరితో కలిసిపోయే ఏర్పాటు ఉండాలి. వారూ అందరూ వెళ్లే చోట్లకు, పని చేసే చోట్లకు నిర్భయంగా, నిర్లజ్జగా వెళ్లే అవకాశం ఉండాలి.

Back to Top